Neevumte naaku chalu yesayyaa - Sp balu Lyrics


Neevumte naaku chalu yesayyaa
Singer Sp balu
Composer Raja guntur
Music Raja
Song WriterRaja

Lyrics

నీవుంటే నాకు చాలు యేసయ్యా| నీవెంటే నేను ఉంటానేసయ్యా (2)

నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా (2) ||నీవుంటే||

ఎన్ని బాధలున్ననూ ఇబ్బందులైననూ

ఎంత కష్టమొచ్చినా నిష్టూరమైననూ (2) ||నీ మాట||

బ్రతుకు నావ పగిలినా కడలి పాలైననూ అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా (2) ||నీ మాట||

ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా (2) ||నీ మాట||

నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము నీదు కృపతో నాకేమియు కాదిల సమానము (2) ॥॥నీ మాట||


Neevumte naaku chalu yesayyaa Watch Video

Comments

Popular posts from this blog